![]() |
![]() |

స్టార్ మాలో మరో సీరియల్ కి ఎండ్ కార్డు పడిపోయింది. దాదాపు నాలుగేళ్లు సాగిన "ఇంటింటి గృహలక్ష్మి" సీరియల్ టాటా వీడుకోలు అని చెప్పేసింది. మొత్తం 1158 ఎపిసోడ్స్‌తో హోమ్లీగా నడిచిన ఈ సీరియల్ ఐపోయేసరికి లీడ్ రోల్ యాక్టర్ కస్తూరి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
"నాలుగేళ్ల నుంచి మా మీద మీరంతా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు...నేను మిమ్మల్నందరినీ చాలా మిస్ అవుతాను. మీతో కలిసి ఇంత అద్భుతమైన ప్రయాణం చేసే అవకాశం ఇచ్చిన స్టార్ మా ఛానల్‌కి కృతజ్ఞతలు. అలానే నాకు ఇంత మంచి రోల్ ఇచ్చిన ఇంటింటి గృహలక్ష్మి బృందానికి కూడా ధన్యవాదాలు. ఇక నా తోటి నటీనటులందరికీ థాంక్యూ సో మచ్. మిమ్మల్ని మళ్లీ సెట్స్‌లో చూసే అదృష్టం ఇక లేదు. ఇన్నాళ్లూ తులసిని మీ గృహాలక్ష్మిగా మీ కుటుంబ సభ్యురాలిగా ఆదరించిన తెలుగు ప్రజలకీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. త్వరలోనే మీ ముందుకు మళ్లీ వస్తాను. మర్చిపోలేని జ్ఞాపకాలతో, గుర్తుండిపోయే ఆదరాభిమానాలతో, అంతకుమించిన బాధతో సెలవు తీసుకుంటున్నా" అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది కస్తూరి.
ఇక ఈ పోస్ట్ తో నెటిజన్స్ కూడా కొంచెం బాధపడుతూ మెసేజెస్ చేశారు. "అంత సడెన్ గా సీరియల్ ని పూర్తిచేసేశారేమిటి మేడం, తులసి క్యారెక్టర్ ని చాలా మిస్సవుతాం..మిమ్మల్ని మరో ప్రాజెక్ట్ లో చూసే అవకాశం కోసం వెయిటింగ్...మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటో కూడా చెప్పండి" అంటున్నారు.

గృహలక్ష్మి సీరియల్ తులసి రోల్ ఉన్నంతవరకు బాగుంది కానీ తర్వాత సెకండ్ వైఫ్ ఎంట్రీ ఇచ్చేసరికి ఆడియన్స్ నుంచి చాలా వ్యతిరేకతను ఎదుర్కొంది కూడా...ఇలాంటి సీరియల్స్ ద్వారా సమాజానికి ఎం మెసేజ్ ఇస్తున్నారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక తులసి అలియాస్ కస్తూరి తెలుగు, తమిళం, మలయాళం మూవీస్ లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో గ్యాంగ్ వార్ , సోగ్గాడి పెళ్లాం, నిప్పు రవ్వ, గాడ్ ఫాదర్, చిలక్కొట్టుడు, రథయాత్ర, అన్నమయ్య, మా ఆయన బంగారం లాంటి మూవీస్ లో మంచి రోల్స్ లో నటించింది.
![]() |
![]() |